హైదరాబాద్ : రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం సరికాదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి గెజిట్ అమలు వాయిదా వేయాలని కోరాం. కానీ గెజిట్ అమలు వాయిదా వేస్తామని కేంద్రం చెప్పింది. అవసరమైతే ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం సరికాదు. వైఎస్ హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగి ఉండొచ్చు. వైఎస్ హయాంలో తెలంగాణకు చాలా అంశాల్లో నష్టం జరిగింది.
తెలంగాణ గొప్పగా పురోగమిస్తోంది. రాజకీయాల పేరిట రాష్ట్రాన్ని మలినం చేయొద్దు.. రాష్ట్రాన్ని శపించొద్దు. గంజాయి, డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాం. 57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్, కొత్త రేషన్ కార్డులకు మళ్లీ అర్జీలు స్వీకరిస్తాం. అనాథల కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం అని సీఎం కేసీఆర్ తెలిపారు.