హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ ఎవరూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం’ సందర్భంగా దివ్యాంగులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మన్యూనతకు లోనుకాకుండా, ఆత్మైస్థెర్యంతో లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వం ఆసరాతో అండగా నిలుస్తున్నదని, దివ్యాంగుల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమం లో తెలంగాణను అత్యుత్తమంగా గుర్తించి కేం ద్రం అవార్డులు అందించిందని గుర్తుచేశారు. దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనబరిచే ఉద్దేశంతో మహిళా శిశు సంక్షేమశాఖ నుంచి దివ్యాంగుల (వికలాంగుల)శాఖను స్వతంత్రశాఖగా ఏర్పాటుచేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు దివ్యాంగులకు రూ.500 పెన్షన్‌తో సరిపడితే, స్వరాష్ట్రం లో ఒక కుటుంబంలో ఎంతమంది దివ్యాంగులు ఉంటే అందరికీ రూ. 3016 చొప్పున పెన్షన్‌ను అందిస్తూ ఆత్మైస్థెర్యాన్ని కలిగిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతిబంధకాలు అడ్డుకే ఉపకరణాలు
దివ్యాంగులకు అవసరమైన వీల్చెయిర్లు, త్రీ వీలర్ సూటీలు, చేతికర్రలు మొదలైనవి సమకూరుస్తూ రోజువారి జీవితంలో ఎదురొనే ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేక విద్య అందించేందుకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల ఏర్పాటుతోపాటు, ప్రీ మె ట్రిక్, పోస్ట్‌మెట్రిక్ సాలర్షిప్లను అందిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం మరెన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నదని వెల్లడించారు. దివ్యాంగులను మనలో ఒకరిగా ఆదరిస్తూ, వారి సాధికారత కోసం సమాజంలోని ప్రతిఒకరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు.