Satyavathi Rathod | ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి : మంత్రి సత్యవతి
Satyavathi Rathod | తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో బంజారా సమ్మేళనం కార్యక్రమం జరిగింది.
Satyavathi Rathod | తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని ఓ ఫంక్షన్ హాలులో బంజారా సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగును అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని.. భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్, సౌభాగ్యలక్ష్మి కింద రూ.3వేలు ఇవ్వడంతో పాటు తెల్లరేషన్‌కార్డు దారులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు.
కాంగ్రెస్ పాలనలో బంజారాలకు చేసిందేమీలేదని, మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. కాంగ్రెస్ వస్తే కర్నాటక తరహాలోనే కరెంటు కష్టాలు తెలంగాణలో పునరావృతమవుతాయన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని.. అక్కడ ఐదుగంటల కరెంటు ఇస్తున్నారన్నారు. తెలంగాణలో 3గంటల పార్టీ కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అంటున్నాడన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ 24గంటల పాటు రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. రైతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
ఆ పార్టీకి మాత్రం రైతులపై ఎలాంటి మమకారం, చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో తండాలను జీపీలుగా చేసిన నేత సీఎం కేసీఆర్ అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో లంబాడా జాతికి ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు బీజేపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేదని, పదేళ్లపాటు గిరిజన యూనివర్సిటీ ఇవ్వకుండా కాలయాపన చేసి ద్రోహం చేసిందన్నారు. నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచిన పరిస్థితి నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత స్వయం పాలన దిశగా అడుగులు పడ్డాయన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతిని ప్రజలు ఆశీర్వదించి.. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

