హైదరాబాద్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి (MLA Kishan reddy) మాతృమూర్తి పద్మమ్మ కన్నుమూశారు. వృద్ధాప్యంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తమ స్వగ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎలివినేడులో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
కిషన్ రెడ్డి మాతృమూర్తి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మంత్రులు హరీశ్ రావు (Minister Harish rao), వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) మంచిరెడ్డి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Kishanreddy