హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(Cheif Minister KCR) రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar)కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి గంగుల సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మంత్రిని అభినందించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘ ప్రజా సంక్షేమానికి(People Welfare) శ్రమిస్తున్న మీరు ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానని’ అన్నారు. మంత్రి పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కిషోర్ గౌడ్, సివిల్ సప్లైస్ కమిషనర్ వి. అనిల్ కుమార్, జీఎం రాజారెడ్డి, ఇతర అధికారులు తదితరులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.