CM KCR | స్టేషన్ ఘన్పూర్ : మిగిలిన నాలుగైదు శాతం మంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కడియం శ్రీహరికి మద్దతుగా ప్రసంగించారు.
కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కొన్ని విషయాల్లో సిగ్గుండాలి. రైతురుణమాఫీ చేస్తామని రెండు సార్లు చెప్పాం. బాజాప్తా చేసినం. అందులో కరోనా రావడం వల్ల ఒక సంవత్సరం ఆదాయం సున్నా అయింది. రూపాయి కూడా రాలేదు. దాని వల్ల లేట్ అయింది. లేదంటే ఎప్పుడ అయిపోవు రైతు రుణమాఫీ. రుణమాఫీ మూడేండ్ల కిందనే అయిపోవాలి. కరోనా కొట్టిన దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయి ఆలస్యమైంది. మొన్న చేసినం. 90 శాతం అయిపోయింది రుణమాఫీ. ఏనుగు వెళ్లింది తోక చిక్కింది. లక్ష వరకు అందరికీ అయిపోయింది. ఆ పైన ఉన్నోళ్లకు ఓ నాలుగైదు శాతం మందికి మిగిలింది. అది ఇయ్యమా మేం. దాన్ని కూడా ఇష్యూ చేశారు కాంగ్రెసోళ్లు. అడ్డు పడ్డది కూడా కాంగ్రెసోడే. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి ఇప్పుడు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిండు. మళ్లా బజార్లకు వచ్చి రుణమాఫీ కాలేదని మాట్లాడుతున్నరు. సిగ్గు కూడా ఉండాలి. మిగిలిన వాళ్లకు కూడా 100 శాతం ఇమిడియట్గా ఇచ్చేస్తాం. దాని గురించి అసలు ఆలోచించే అవసరం లేదు రైతులు. మంచేదో, చెడు ఏందో నిర్ణయించాలి.. ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ కోరారు.