హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గులాబీ గుబాళిస్తున్నది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలు జనజాతరను తలపిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు అన్నిస్థాయిల్లో కథానాయకులై ప్రజా ఆశీర్వాదసభలను విజయవంతం చేస్తున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభల పేరుతో తెలంగాణను తరగతిగది చేశారు. ప్రతిసభలో ఆయన ప్రగతిపాఠాన్ని ప్రజలకు వివరిస్తున్న తీరు రాజకీయ పాఠశాలను తలపిస్తున్నది. పార్టీ ఆవిర్భా వం నుంచి ఉద్యమ నిర్మాణంలో సుదీర్ఘపోరా టం, తెలంగాణ సాధన, తొమ్మిదిన్నరేండ్లుగా దేశానికి ఆదర్శంగా నిలిచిన ఉదంతాలను ప్రజా ఆశీర్వాద సభల సాక్షిగా కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారు. గత నెల 15న హుస్నాబాద్‌లో మొదలైన ప్రజా ఆశీర్వాద సభలు 74 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 28న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల సభల్లో పాల్గొని, గజ్వేల్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభతో ఈ ఎన్నికల సమరశంఖారావాన్ని పూర్తి చేయనున్నారు.
రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, పంటకొనుగోలువంటి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలకు రైతులు ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నది. తెలంగాణ అప్పుడెట్లుండే? ఇప్పుడెట్లుండే? అని సీఎం కేసీఆర్ వివరిస్తున్నప్పుడు జనం హర్షధ్వానాలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటువేసి ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా గెలిపించాలని రైతుసమాజం కంకణం కట్టుకున్నారని, అప్రతిహతంగా కొనసాగుతున్న సభలే ఇందుకు నిదర్శమని గులాబీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
3 గంటల కరెంట్ చాలు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్, తమ రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేస్తున్న వాదనను సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలకు పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. సభా ప్రాంగణాల సాక్షిగా కాంగ్రెస్ గతచరిత్రను కండ్లకు కడుతున్నారు. దీంతో సభా ప్రాంగణాల నుంచి ఇండ్లకు చేరుతున్న ప్రజలు కాంగ్రెస్‌పై ఓటుతో తిరుగుబాటు చేస్తామనే విశ్వాసంతో వెళ్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. 3 గంటల కరెంటు కావాలా? 24 గంటలు కరెంటు కావాలా? అని కేసీఆర్ ప్రస్తావించగానే తమకు 24 గంటలు కరెంటు కావాలంటూ రైతులు చేతులెత్తి తమ ఆమోదాన్ని తెలుపుతున్నారు. ధరణి విషయంలోనూ కేసీఆర్ ప్రజల నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని కోరుతున్నారు. ధరణి ఉండాలా? వద్దా? అని ప్రజలను ప్రజా ఆశీర్వాద వేదికలపై నుంచి అడుగుతుంటే ఉండాలంటూ ముక్తకంఠంతో రైతులు ఆమోదం చెప్తున్న దృశ్యాలు ప్రతీ సభలో కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలపై కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు సబ్బండ వర్ణాలు చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తిస్తున్నాయి.
ఆదిలాబాద్: నిర్మల్, ముథోల్, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, బోథ్.
కరీంనగర్: హుస్నాబాద్, సిరిసిల్ల, ధర్మపురి, కోరుట్ల, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, చొ ప్పదండి, హుజూరాబాద్, మానకొండూరు.
నిజామాబాద్: జుక్కల్, బాన్సువాడ, బా ల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, ని జామాబాద్ అర్బన్, రూరల్, ఎల్లారెడ్డి
వరంగల్: జనగామ, మహబూబాబాద్, వర్దన్నపేట, నర్సంపేట, పాలకుర్తి, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్, డోర్నకల్, చేర్యాల (జనగామ నియోజకర్గంలో జరిగిన రెండు ప్రజా ఆశీర్వాదసభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్).
ఖమ్మం: పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు, కొత్తగూడెం, ఖమ్మం, అశ్వరావుపేట, భద్రాచ లం, పినపాక, మధిర, వైరా.
నల్లగొండ: భువనగిరి, మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, నల్లగొండ, సూర్యాపేట.
మహబూబ్‌నగర్: జడ్చర్ల, అచ్చంపేట, వనపర్తి, గద్వాల, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, ఆలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి
మెదక్: సిద్దిపేట, నారాయణఖేడ్, మెదక్, నర్సాపూర్.
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, మేడ్చల్.