న్యూఢిల్లీ: దేశం సుభిక్షంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఢిల్లీలో రాజశ్యామల యాగం ప్రారంభించారు. ఈ యాగం కోసం ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ముందుగానే ప్రత్యేక యాగశాలను నిర్మించారు. ఇతర ఏర్పాట్లు అన్నీ పూర్తిచేశారు. ఈ యాగం పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వచ్చారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. యాగ నిర్వహణ కోసం వారు సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు (బుధవారం) నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.