హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా ఫామ్ హౌజ్ వద్ద అడుగుపెడితే ఆరు ముక్కలు అయితవ్. అది గెస్ట్ హౌజ్ కాదు.. అది ఫార్మర్ హౌజ్.. అన్ని లంగ మాటలు మాట్లాడుతావ్. ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా అత్తగారి పొలం, మా పొలంతో పాటు ఊర్లన్నీ మునిగిపోయాయి. మేం దొంగ సొమ్ముతో బతకం. అందుకే మేం దేనికి భయపడం. నా హద్దులను నిర్ణయించడానికి నీవు ఎవరు?
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. ఇప్పటికైనా మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. మీ తాత జేజమ్మ ఎవరున్నా వదిలిపెట్టం. ఈ దేశ ఖజానాలో మా వాటా ఉంది. ఈ దేశం మీ అయ్య సొత్తు కాదు. మిమ్మల్ని వదలం, వేటాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వరకు పోరాడుతాం. మీరు వడ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వద్దా? అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. తెలంగాణ రైతులు, ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతున్నారు. మీరు డిపాజిట్లు కోల్పోయారు అని కేసీఆర్ గుర్తు చేశారు.