‘డబుల్ ఇండ్ల’కు 11,700 మంది ఎంపిక
రాష్ట్రంలో పేదవాడి ఇంటి కల నెరవేరుతున్నదని, ఇది సీఎం కేసీఆర్ తీసుకున్న అతి గొప్ప నిర్ణయమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
- ఆన్లైన్లో లాటరీ ద్వారా ప్రక్రియ
- 21న లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు
- ఇండ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ
- మంత్రి తలసాని వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పేదవాడి ఇంటి కల నెరవేరుతున్నదని, ఇది సీఎం కేసీఆర్ తీసుకున్న అతి గొప్ప నిర్ణయమని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లకు పూర్తి పారదర్శకంగా ఆన్లైన్ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు. రెండో విడతలో 11,700 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు.
వారికి ఈ నెల 21న ప్రాంతాల వారీగా ఇండ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమానికి మంత్రులు తలసాని, సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడు తూ.. ఆన్లైన్ లాటరీ ద్వారా ప్రతి నియోజక వర్గం నుంచి 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మాత్రం 300 మందినే ఎంపిక చేశారు.
ర్యాండమైజేషన్ ద్వారా వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ఇండ్ల కేటాయింపు జరిగిందన్నా రు. డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ముఠాగోపాల్, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు ప్రభాకర్, వాణీదేవి, మీర్జా రహమత్ బేగ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

