హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య శ్రీ సేవలను మరింత విస్తరిస్తామని, పరిధిని రూ.15 లక్షలకు పెంచుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. 3 కోట్లమందికిపైగా ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నది.