BRICS Menu : బ్రిక్ సమావేశాలకు విచ్చేస్తున్న దేశాధినేతల కోసం నోరూరించే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. పోలీసుల భద్రతా ఏర్పాట్లలో మునిగిపోగా.. నగరంలోని మూడు ప్రముఖ హోటళ్ల చెఫ్‌లు పలురకాల పసైందన రెసిపీలపై దృష్టి సారిస్తున్నారు. ప్రాంతీయ వంటకాలతో బ్రిక్స్ అధినేతల మనసు చూరగొనాలనే ఉద్దేశంతో జనం మెచ్చిన వాటిని వండి వార్చనున్నారు. ఇంతకూ జాబితాలో ఏమే ఉన్నాయంటే.. కశ్మీరీ వాల్నట్స్, తమిళనాడు మురుకు, రాజస్థాన్ మినీ కచోరీతో పాటు మరిన్ని వైవిధ్యమైన రుచులతో లొట్టలే కడుపారా తినేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పద్దెనిమిదో బ్రిక్స్ సమావేశాలకు భారత్ ఆతిథ్యమిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగే సదస్సుకు విచ్చేస్తున్న దేశాధినేతలకు పసైందన విందు భోజనం సిద్ధం చేస్తున్నారు చెఫ్‌లు. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొననున్న అతిథులకు నగరంలోని మూడు ప్రముఖ హోటళ్లు నోరూరించే రుచులను సిద్ధం చేయనుంది. ఎన్డీటీవీ ప్రత్యేక కథనం ప్రకారం.. ఈ సదస్సుకు వస్తున్న ప్రముఖుల కోసం ఇప్పటికే మెనూ ఖరారు చేశామని లీలా ప్యాలెస్, తాజ్ మహల్, ది లలిత్ హోటల్ చెఫ్‌లు తెలిపారు.
From lotus dessert to quinoa upma: What The Leela Palace will serve BRICS delegates.
The hotel’s Ojasya wellness programme features ingredients such as millet, bajra, jowar and sattu, with dishes including quinoa upma.
The offerings also include millet ladoos, savoury millet… pic.twitter.com/tiUOPNbhFO
— News Arena India (@NewsArenaIndia) September 10, 2026

బ్రిక్స్ సమావేశాల సందర్భంగా దేశాధినేతలకు, ప్రతినిధులకు మన దేశంలోని ఆరు ప్రాంతాల్లోని పాపులర్ వంటకాలను వడ్డించనున్నారు. వీటిలో.. స్పైస్డ్ వాల్నట్స్(కశ్మీర్), మైదా కాజు (పురాణీ ఢిల్లీ), మురుకు(తమిళనాడు), భకర్వడీ(మహారాష్ట్ర), కుచో నిమక్కీ(బెంగాల్), మినీ కచోరి(రాజస్థాన్)లు మెనూలో ఉన్నాయి. వీటితో పాటు మిల్లెట్ బిస్కెట్లు, గ్రనోలా బార్స్, గలౌటి కెబాబ్స్, తందూరి బేక్డ్ బ్రెడ్స్, చైనీస్ క్యాబేజీ, కీడ్నీ బీన్ స్వీట్(జపాన్ స్టయిల్) వంటి రుచులను సిద్ధం చేస్తున్నారు.
జాతీయ పువ్వు కమలంను కూడా సర్వ్ చేయనున్నారు. వరసలుగా ఆకట్టుకునేలా ఉండే ఈ పువ్వును తినుబండారంగా తయారుచేయనున్నారు. బ్రిక్స్ ఇండియా 2026ను ప్రతిబింబించడమే ఈ ఎడిబుల్ లోస్ ఉద్దేశమని చెఫ్‌లు పేర్కొన్నారు. గులాబీలు, కుంకుమపువ్వు, యాలకులు.. మనదేశంలో లభించే రకరకాల పండ్లతో ఈ కమలాన్ని తీర్చిదిద్దనున్నారు. ఢిల్లీలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో బ్రిక్స్ సమావేశాలు జరుగనున్నాయి.
