ప్రస్తుతం ‘ఆదర్శకుటుంబం’ సినిమా ప్రచార కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నారు అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇందులో భాగంగానే ఎన్టీఆర్తో తాను చేయబోతున్న పాన్ ఇండియా పౌరాణిక చిత్రం గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
కానీ నిజానికి మేం టైటిల్ను ఇంకా నిర్ణయించలేదు. స్క్రిప్ట్ అయితే సిద్ధంగా ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ సినిమాను తెరకెక్కించనున్నాం. ఆ పాన్ ఇండియా ప్రాజెక్టుకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతోపాటు టైటిల్ని కూడా త్వరలోనే గ్రాండ్గా ప్రకటిస్తాం’ అని త్రివిక్రమ్ తెలిపారు.