తుంగతుర్తి, సెప్టెంబర్ 10 : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎంపీపీ సీతయ్య కోరారు. గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నానంటూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపెల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, పట్టణ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గోపగాని వెంకన్న, తాళ్లపల్లి యాకయ్య, మల్లెపాక రాములు, గడ్డం సోమేశ్, పాలడుగు జలంధర్, బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.

‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి’
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీరవనిత చాకలి ఐలమ్మ చేసిన పోరాటం అజరామరమని, నేటితరం యువతకు స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్, పట్టణ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గోపగాని వెంకన్న, తాళ్లపల్లి యాకయ్య, మల్లెపాక రాములు, గడ్డం సోమేశ్, పాలడుగు జలంధర్, బొజ్జ సాయికిరణ్ పాల్గొన్నారు.