జోగులాంబ గద్వాల : జిల్లాలోని అయిజ పట్టణానికి ( Aija town ) చెందిన నీలద్ది శ్రీకాంత్ (48) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజర్‌గా పనిచేస్తూ ప్రస్తు తం ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామ ఇన్చార్జి ఏఈఓ ( AEO )గా విధులు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా బుధవారం విధులు ముగించుకుని సాయంత్రం తన ద్విచక్ర వాహనంపై అయిజకు భారత్ మాల రోడ్డు మీదుగా తిరిగి వస్తుండగా వెంకటాపూర్ సమీపంలో ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.