హైదరాబాద్, మార్చి 7 : నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ మేరకు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని, నిర్మల్ జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ తుది ఆమోదం తెలిపిన తర్వాత కాలేజీ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు.