అర్వపల్లి, జూలై 8 : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీలో వర్గవిబేధాలు మళ్లీ భగ్గుమన్నాయి. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గ మండల కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే సామేల్ ఏకపక్ష నిర్ణ యం తీసుకొని బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే అధ్యక్ష పదవులను కట్టబెట్టారన్న ఆరోపణతో మొదలైన సమస్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. బుధవారం ఎంపీ చామల, దామోదర్‌రెడ్డి వర్గీయులు మం డల అధ్యక్షుల ఎన్నిక రద్దు చేయాలని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వెళ్తుండగా.. అర్వపల్లిలో సామేల్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకొని రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశంచేసి ఇరువర్గాలను చెదరగొడుతున్న క్ర మంలో కొంతమంది కార్యకర్తలు, పోలీసు ల చేతుల్లోని లాఠీలను గుంజుకొని దాడిచేశారు. ఈ ఘటనలో పోలీసులు సైతం గాయపడ్డారు. ప్రత్యేక పోలీసు బలగాలు రావడంతో వచ్చి పరిస్థితిని అదుపులోకి తె చ్చారు. ఎమ్మెల్యే సామేల్ వచ్చినప్పటి నుం చి పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని పలువురు పేర్కొంటున్నారు.