హైదరాబాద్: హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వస్తుందన్నారు. భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైటెక్స్‌లోని ఐకియా వెనుక ఉన్న 3.7 ఎకరాల్లో ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ శాశ్వత భవన నిర్మాణానికి జస్టిస్ ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం కొనసాగుతున్నదని చెప్పారు. సింగపూర్ మాదిరిగా హైదరాబాద్ కేంద్రం కూడా ప్రపంచ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ సమయానికి భవనం పూర్తి కావాలని ఆశించారు.
ఐఏఎంసీ ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌కు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారని, అంతే త్వరగా దానికోసం ఓ తాత్కాలిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారన్నారు. మధ్యవర్తిత్వం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయని నాతోపాటు కేసీఆర్ కూడా నమ్ముతారని చెప్పారు. నేడు ఈ భవన నిర్మాణానికి భూమిపూజ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించారని సీజేఐ వెల్లడించారు.
ఆర్బిట్రేషన్ మీడియేషన్ భవన నిర్మాణానికి సహకరించిన సీజేఐ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమాకోహ్లి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంర్‌దశర్మ, ఐఏఎంసీ ట్రస్టీలైన స్రుపీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర్రావు, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Hon'ble Chief Justice of India Sri NV Ramana, Chief Justice of Telangana High Court Sri Satish Chandra Sharma & Ministers Sri @IKReddyAllola, Sri @KTRTRS, pic.twitter.com/WYYSlKz2Xa
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) March 12, 2022