యాదగిరిగుట్ట, అక్టోబర్11: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (CJ Aparesh Kumar Singh) పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఆయన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే. లక్ష్మణ్, జస్టిస్ కే. శరత్, జస్టిస్ కే. సుజన, జస్టిస్ వి రామకృష్ణా రెడ్డితో కలిసి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. కొండపైకి చేరుకున్న వారికి కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఇన్చార్జి ఈవో రవి నాయక్ పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ప్రధానాలయానికి చేరుకున్న ఆయన స్వయంభు లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయముఖ మండపంలో వారికి ఆలయ ఈవో రవి నాయక్ స్వామి వారి ప్రసాదం చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఏసీపీ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.