30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
- రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ
- సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడి
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఇప్పటివరకు 30 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 9 లక్షల టన్నుల సన్నరకం ధాన్యం, 21 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించామని వెల్లడించారు. రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు మరింత ముమ్మరంగా సాగేందుకు 8,575 కేంద్రాలను ప్రారంభించామని, కొనుగోలు కేంద్రాల వద్ద 18.6 కోట్ల గన్నీ బ్యాగ్‌లను అందుబాటులో ఉంచామని వివరించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు సుమారు 11,500 రవాణా వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు సందేహాలు, సమస్యలు ఉన్నా, ఏదైనా సహాయం కావాలన్నా టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1967ను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

