హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తేతెలంగాణ): ధాన్యం దారి మళ్లిస్తే బాధ్యులైన మిల్లర్లపై కఠిన చర్యలు
తీసుకుంటామని సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మిల్లులకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులతో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నాలుగు రోజుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పలువురిని అరెస్ట్ చేశామని తెలిపారు.