హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సోమవారం సెలక్షన్ లిస్ట్ విడుదలైంది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 734 పోస్టులు, వైద్యవిధాన పరిషత్ పరిధిలో 209 పోస్టులు, ఐపీఎంలో ఏడు పోస్టులున్నాయి. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఏడాది జూన్‌లో 969 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే.
4,803 మంది దరఖాస్తులు వచ్చాయి. గత నెల మెరిట్ లిస్ట్ విడుదల, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వైద్యారోగ్యశాఖ పూర్తి చేసింది. వాటి ఆధారంగా 950 పోస్టులకు సెలక్షన్ లిస్ట్ విడుదలను చేసింది. ఎంపికైన అభ్యర్థులకు ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నియామక ప్రక్రియ పారదర్శకంగా, సులువుగా జరిగిందంటూ ట్వీట్ చేశారు.