హైదరాబాద్, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ) : సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి వంద రోజులైనా బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందలేదని, ఇంకెప్పుడిస్తరు? అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రామయ్య, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ రేవంత్‌రెడ్డి సర్కారును నిలదీశారు. మంగళవారం హైదరాబాద్‌లోని కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మికశాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పటివరకు రూ.25 లక్షలే అం దజేసిందని విమర్శించారు. సీఎం ఇంటి ఎదుట బాధిత కుటుంబ సభ్యులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, మల్లికార్జున్, రమ పాల్గొన్నారు.