హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ఆధునిక, సమర్థమైన ప్రజా రవాణా వ్యవస్థగా ఎదగాల్సిన మెట్రో రైలు వ్యవస్థ ఆగమవుతున్నదని పౌరసమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. 2017లో ఎన్నో ఆశలతో ప్రారంభించిన మొదటి దశ బలిపీఠం ఎక్కుతున్నదని ఆవేదన వ్యక్తం అవుతున్నది. అర్బన్ డెవలప్మెంట్ ఫో రం, సిటిజన్స్ ఫర్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం, ైక్లెమేట్ ఫ్రంట్ తెలంగాణ ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. గత రెండేండ్లలో మెట్రో ఫేజ్-1, రెండో దశ విస్తరణపై నెలకొ న్న వివాదాలపై గళమెత్తారు. కాంగ్రెస్ ప్రభు త్వం అవలంబిస్తున్న విధానాలపై విమర్శలు కురిపించారు.
రియల్ఎస్టేట్ ప్రయోజనాలకోసమే రెండో దశ విస్తరణ అని దుయ్యబట్టారు. మొదటిదశలోని లోపాలు, అక్రమాలను తే ల్చేందుకు కాగ్ ఆడిట్ చేయాలని, లెక్కాపత్రం లేకుండా ప్రతిపాదించిన రూ.38,595 కోట్ల మెట్రో ఫేజ్-2ను పునః పరిశీలించాలని డి మాండ్ చేశారు. మొదటి దశ ప్రారంభంలో అంచనా దానికంటే ప్రయాణికుల సంఖ్య భా రీగా తగ్గిందని పేర్కొన్నారు. లక్ష్యం కంటే 60 శాతం తక్కువ ప్రయాణికులనే గమ్యస్థానాలకు చేరుస్తున్నదని అన్నారు. అయినా వ్యయ అంచనా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు 269 ఎకరాల భూమిని ప్రభుత్వం 35 ఏండ్లు ఉచితంగా లీజుకు ఇచ్చిందని, ఈ భూమిని వాణిజ్యపరంగా వాడుకుంటూ సంపాదించిన ఆదాయం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఈ అంశా న్ని ఎందుకు తేల్చడం లేదన్నారు. బస్సుల కంటే 2-3 రెట్లు చార్జీలు అదనంగా వసూలు చేస్తూ సామాన్యులను మెట్రో సంస్థ దోచుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెల 25న ఐఆర్ఎఫ్సీ చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం హైదరాబాద్ మెట్రో కోసం రూ.13,527 కోట్ల రీఫైనాన్సింగ్ ఒ ప్పందం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో పారదర్శకత లేదని ఆరోపించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన వడ్డీ రేట్లు, కొత్త నిబంధనలను తెలంగాణ శాసనసభకుగానీ, పార్లమెంటరీ కమిటీకిగానీ తెలుపకుండా ఎందుకు దాచిపెట్టారని ప్రభుత్వాన్ని నిలదీశారు. మెట్రో ఫేజ్-1 వ్యయంపై తక్షణమే కాగ్‌తో ఆడిట్ చేయించి, నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల ట్రాఫిక్ రద్దీని అధ్యయనం చేసిన నివేదిక, ఫేజ్-2 మెట్రో ప్రయాణికుల అంచనా నివేదికలను బయటపెట్టాలని డిమాండ్‌చేశారు.
రెండో దశ విస్తరణపై ప్రభుత్వం చెప్తున్నవన్నీ అబద్ధ్దాలేనని, సమాచార హక్కు చట్టం ద్వారా తేలిందని ప్రతినిధులు వెల్లడించారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2026 మే 26న ఇచ్చిన ఆర్టీఐ సమాధానం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 122 కిలోమీటర్ల ప్రతిపాదన ఇంకా రివ్యూ దశలోనే ఉందనీ, దీనికి ఎలాంటి ఆమోదం లేదని, నిధుల కేటాయింపులు ఇంకా జరుగలేదని స్పష్టం చేసిందని తెలిపారు. మెదటిదశలో 40 శాతం ప్రయాణికులను కూడా సాధించలేని హైదరాబాద్ మెట్రో ఏ ప్రాతిపదికన రూ.38,595 కోట్లతో రెండో దశకు మొగ్గుచూపుతున్నదని ప్రశ్నించారు. ఈ నిధులను టీజీఆర్టీసీ, ఎంఎంటీఎస్ విస్తరణకు ఖర్చు చేస్తే సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని హితవు పలికారు. కేవలం ఐటీ కారిడార్లు, రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాల కోసమే రెండోదశ విస్తరణ అని ఆరోపించారు.