TSPSC | తుది దశకు చేరుకున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ దర్యాప్తు.. ఇప్పటివరకు 84 మంది అరెస్టు
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నది. లీకేజీతోపాటు మాస్‌కాపీయింగ్‌కు సంబంధించిన పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించింది. ఇప్పటికే 84 మంది నిందితులను ఈ కేసులో చేర్చిన సిట్.. 83 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది.
TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు తుదిదశకు చేరుకున్నది. లీకేజీతోపాటు మాస్‌కాపీయింగ్‌కు సంబంధించిన పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించింది. ఇప్పటికే 84 మంది నిందితులను ఈ కేసులో చేర్చిన సిట్.. 83 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. మార్చి 11న బేగంబజార్ ఠాణాలో నమోదైన ఈ కేసును సిట్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు కోసం సిట్ సిబ్బందిని ఉన్నతాధికారులు బృందాలుగా విభజించారు.
టీఎస్పీఎస్సీలో పనిచేసే ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి కస్టోడియన్ కంప్యూటర్ నుంచి గ్రూప్-1, డీఏవో, ఏఈఈ, ఏఈ ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసినట్టు సిట్ నిర్ధారించింది. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని తమతో పనిచేసే వారికి, దగ్గరి బంధువులకు అందించి, మిగతా ప్రశ్నపత్రాలను మార్కెట్లో లక్షలకు విక్రయించినట్టు సిట్ వెలుగులోకి తెచ్చింది. వారందరినీ అరెస్టు చేయడంతోపాటు మాజీ ఏఈ పొల రమేశ్ హైటెక్ మాస్‌కాపీయింగ్ లింకును ఛేదించి గురువారంనాటికి 83 మంది అరెస్టు చేసింది. కేసు కొలిక్కి రావడంతో ఈ నెల చివరినాటికి దర్యాప్తును ముగ్గించాలనే ఆలోచనతో సిట్ ఉన్నది. బందోబస్తులు, సెలవులను పక్కన బెట్టి ఈ కేసుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ దర్యాప్తును ముమ్మరంగా చేసింది సిట్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

