హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై సిట్, ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు గ్రూప్-1 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది.
పరీక్షల నిర్వహణను వాయిదా వేసేందుకు ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ సోమవారం తీర్పు వెలువరించారు. పరీక్షలను వాయిదా వేసేందుకు ఎలాంటి కారణాలు లేవని స్పష్టం చేశారు.