పాడి కౌశిక్‌రెడ్డికి సీఐడీ నోటీసులు
బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సీఐడీ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న ఉదయం 11.30 గంటలకు లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు.
- ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలు
- 4న విచారణకు రావాలని సూచన
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సీఐడీ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న ఉదయం 11.30 గంటలకు లక్డీకాపూల్‌లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, కరీంనగర్ సీపీని దూషించినట్టు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. విచారణకు సహకరించాలని కౌశిక్‌రెడ్డిని అధికారులు కోరారు.
విచారణకు హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కాగా, ఈ ఏడాది జనవరి 29న సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్‌లోని కేపీ చౌరస్తాలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో మద్దతు దారులతో కలిసి పాడి కౌశిక్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. దీంతో హుజురాబాద్ పోలీస్‌స్టేషన్‌లో 189(3), 126(2), 132, 299, 196, 351(2), ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయగా, ఈ మేరకు సీఐడీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

