Bhupalapally | భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 1: న్యాయం చేయాలని భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసులే తనపై దాడి చేశారని వరంగల్లోని ప్రైవే ట్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుడు శంకర్ శనివారం విలేకరులతో వాపోయారు. 23 సంవత్సరాలుగా భూపాలపల్లిలో బైక్ మెకానిక్ షాప్ ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నానని శంకర్ వివరించాడు. గత నెల 27న భూపాలపల్లిలో బైక్ మెకానిక్లు షాపుపై దాడి చేయడంతోపాటు తనను కొట్టి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశాడు.
తనకు న్యాయం చేయాలని కోరుతూ భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్కు పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు దూషించడమేగాక దాడికి పాల్పడ్డారని ఆ రోపించాడు. దాడిలో పొట్టలోని పేగు మూడు చోట్ల పగిలి సర్జరీ జరిగిందని రోదిస్తూ తెలిపా డు. దాడికి పాల్పడిన బైక్ మెకానిక్లు, సీఐ పై చట్టపరంగా చర్యలు తీసుకొని తనకు న్యా యం చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.