పెద్దపల్లి : కరోనా వైరస్ను త్వరగా నివారించాలని క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం జిల్లాలోని మంథని పట్టణంలో గల సీయోను ప్రార్థన మందిరంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవజనులు వల్లూరి ప్రభాకర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రజలు బయటకు రాకుండా ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకరి కుమార్, సంఘం పెద్దలు ఎం కె జోసెఫ్, మంథని ప్రసాద్, చింతకుంట్ల ప్రేమ్ కుమార్, అందె రమేష్, దాసరి సదానందంతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనా పట్ల ఆందోళన వద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
గ్రేటర్ వరంగల్లో ఎన్నారైల ఇంటింటి ప్రచారం
కరోనాతో పూల వ్యాపారి మృతి..అంత్యక్రియలు అడ్డుకున్న గ్రామస్తులు
వరంగల్ జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
ఖమ్మం అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యం : ఎమ్మెల్సీ వాణీదేవి