Sunke Ravi Shankar | గాంధీజీ వర్ధంతి రోజు గాంధీ విగ్రహం దగ్గర మందు సీసాలు ఉండడం గాంధీ మహాత్మునికే అవమానమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. చొప్పదండి పట్టణంలోని పాత గ్రామపంచాయతీ ఆఫీసు ముందు ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఆకతాయిలు మందు తాగి బీరు సీసాలు విగ్రహం దగ్గరే పడేశారు. గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ మోసపూరిత 420 పథకాల అమలుకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేయడానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బీఆర్ఎస్ నాయకులు విగ్రహం దగ్గరికి రాగానే సీసాలను చూసి ఆశ్చర్య పోయారు.
ఈ సందర్భంగా సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పట్టణ నడిబొడ్డులో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఆకతాయిలు మద్యం సేవించి బీరు సీసాలు పడవేయడం దారుణమని మండిపడ్డారు. నడిబొడ్డున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పోలీసులు, మున్సిపాలిటీ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదన్నారు. పట్టణ నడిబొడ్డులోనే ఇలా జరిగితే పోలీసులు ఏమి చేస్తున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శమని అన్నారు. బీరు సీసాలు అక్కడి నుండి తీసి వేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతిరావు మాజీ జడ్పీసీటీ ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆరెల్లి చంద్రశేఖర్ గౌడ్, గడ్డం చుక్కారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు లోకి రాజేశ్వర్ రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్ కుమార్, వెల్మ నాగిరెడ్డి, బంధారపు అజయ్ కుమార్, మాడూరి శ్రీనివాస్, మహేష్ ని మల్లేశం, గన్ను శ్రీనివాస్ రెడ్డి, గాను లక్ష్మణ్, సీపెల్లి గంగయ్య, మారం యువరాజ్, పెద్దెల్లి అనిల్, నరేష్ రావణ్ తదితరులు పాల్గొన్నారు