వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబా ద్), జూన్ 10: రాష్ట్రంలో వరి సాగుకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ వర్సిటీ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ దామోదర్రాజు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి వరి రైతులు అధిక దిగుబడుల కో సం నాణ్యమైన దొడ్డు, సన్న, అతిసన్న రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
ఎంపీ 1010కు ప్రత్యామ్నాయంగా కేఎన్ ఎం 118, ఆర్ఎన్ఆర్ 29325, ఆర్ఎన్ఆర్ 28361, డబ్ల్యూజీఎల్ 1355, డ బ్ల్యూజీఎల్ 915, జేజీఎల్ 28639, బీపీటీ సన్న రకాలకు బదులుగా ఆర్ఎన్ఆర్ 150 48, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 733, 44 సిద్ది, డబ్ల్యూజీఎల్ 962, ఆర్డీఆర్ 1200, ఆర్ఎన్ఆర్ 21278, జేజీఎల్ 28545, కేబీఎస్ 6251, కేబీఎస్ 2874, డబ్ల్యూజీఎల్ 1246, జేజీఎల్ 33124, హెచ్ఎంటీ సోనా జైశ్రీరామ్కు ప్రత్యామ్నాయంగా 15048 కేఎన్ఎం 733, ఆర్డీఆర్ 1162 27356 ఆర్ఎన్ఆర్ 31479 రకాలను వర్సిటీ ఎంపిక చేసినట్టు వివరించారు. ఈ విత్తనాలు రాజేంద్రనగర్లోని ప్రధాన వ్యవసాయ కేంద్రంతోపాటు ఉప కేంద్రాల్లోనూ అందుబాటులో ఉన్నట్టు చెప్పారు.