అమరచింత, డిసెంబర్ 25 : ‘సీఎం రేవంత్‌రెడ్డి ఖబడ్దార్.. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి.. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి.. నాడు ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు.. ఆయన కాలిగోటికి కూడా సరిపోవు.. కొడంగల్‌లో సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోత భాష మాట్లాడటం ఆయన స్థాయికి తగదు’.. అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
గురువారం ఆయన వనపర్తి జిల్లా అమరచింతలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులపై రేవంత్.. నోరు పారేసుకోవడంపై ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. ఆంధ్రా గురు వు చంద్రబాబు నాయకత్వంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకూడు తిని, అవకాశం కోసం టీడీపీ.. కాంగ్రెస్‌లోకి జంప్ కొట్టి.. 420 హామీల పేరుతో జనాన్ని దగా చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరచిపోవద్దని సూచించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని.. అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.