మక్తల్, జూన్ 21 : ధాన్యం కొనుగోలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సహకరించడం లేదని సాకు చూపించి ప్రభుత్వం త ప్పించుకోవాలనుకోవడం దారుణమని మం డిపడ్డారు. వానకాలం ప్రారంభం దశలోనే ప్రభుత్వం వడ్లు కొనలేదని ప్రకటనలు చేస్తూ, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ప్రభుత్వం రేవంత్‌రెడ్డిదేనని పేర్కొన్నారు.
భూత్పూ ర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్‌కు నీటిని తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి చేపడుతున్న పేట-కొడంగల్ ప్రాజెక్ట్‌కు కనీ సం డీపీఆర్ లేదని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్నారని విమర్శించారు. మక్తల్‌ను ఎండబెట్టి కొడంగల్‌కు నీరు తరలిస్తే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.