మక్తల్, జూలై 16 : సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. కృష్ణా, భీమా నదులకు వరద లేకపోవడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ సమీపంలోని సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లకు కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసే స్టేజ్-1 పంప్‌హౌస్‌ను గురువారం ఆయన రైతులతో కలిసి పరిశీలించారు.
15 రోజుల కిందట కృష్ణానదికి స్వల్పంగా ప్రవాహం వచ్చినా ప్రాజెక్టుకు నీటిని ఎత్తిపోయలేదని మండిపడ్డారు. గ్రావిటీ కెనాల్ గేట్లను మూసి వేయడంతో స్టేజ్-1 పంప్‌హౌస్‌కు వరద చేరలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.