మక్తల్, ఏప్రిల్ 13 : ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు దండులా కదలాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
సభకు మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రతీ కార్యకర్త తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇది బీఆర్ఎస్ పండుగ, అందరూ వచ్చేందుకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఒక్కో నాయకుడు తన వెంట ఐదుగురు కార్యకర్తలను రజతోత్సవ సభకు తీసుకెళ్లాలని సూచించారు.