నకిరేకల్, మే 2: పండుటాకులపై ఎం దుకు వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. శనివారం నకిరేకల్ -కడపర్తి రోడ్డులో ఉన్న పోస్టాఫీస్ వద్ద ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను చిరుమర్తి లింగయ్య పలుకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పోస్టల్, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వితంతువులు ఎం డలో గంటల తరబడి వేచి చూస్తున్నారని చెప్పారు.
నకిరేకల్ మున్సిపాలిటీలో మూ డువేలకు పైగా పెన్షన్‌దారులు ఉండగా రోజుకు వందమందికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదని తెలిపారు. 4 నుంచి 5 వార్డులతో కలిపి చీమలగడ్డ, మూసీరోడ్డు, బాబన్ సాహెబ్గూడెం, తిప్పర్తి రోడ్డులో నాలుగు పింఛన్ పంపిణీ కేంద్రాలు ఏర్పా టు చేయాలని పోస్టల్, మున్సిపల్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ప్రతి పోస్టాఫీస్‌ల వద్ద కనీస సదుపాయాలు కల్పించేలా సంబంధిత సర్పంచులు, కార్యదర్శులు, పోస్టల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.