హైదరాబాద్, డిసెంబర్ 9(నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సమ్మిట్ కోసం తనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానం ఇవ్వడంపై హీరో చిరంజీవి వింత వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్‌కు రావాలంటూ వారిని సీఎం రేవంత్‌రెడ్డి తన వద్దకు పంపారని ఆయన చెప్పారు. వాళ్లిద్దరు వచ్చే సమయానికి తాను అన్నపూర్ణ స్టూడియోలో ఎవరో అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఉన్నానని, తనకు చాలా ఇబ్బందిగా అనిపించించి వెంటనే షూటింగ్ ఆపేయండని చెప్పి మంత్రులతో మాట్లాడినట్టు చెప్పారు.
అన్ని నగరాలకు హైదరాబాద్ మధ్యలో ఉన్నదని పేర్కొన్నారు. మనకు ఇక్కడే మంచుకొండలు, థార్ డెసర్ట్స్, లాంగెస్ట్ బీచ్‌లు ఉన్నాయని పొంతన లేకుండా వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్మెంట్ చేస్తే సినీ పరిశ్రమలో పనిచేసేందుకు ఎంతోమంది ముందుకొస్తారని, పరిశ్రమ పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని వినియోగించుకోలేదన్న మాట వాస్తవమేనని చెప్పారు.