OU Dctorate | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగంలో చీపురుశెట్టి శ్రీనివాస్ డాక్టరేట్ సాధించారు. ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ”ఇండియా త్రూ ఫారెన్ ఐస్: ఎ స్టడీ ఆఫ్ ది సెలెక్టెడ్ రైటింగ్ ఆఫ్ మార్క్ టులి, ఫ్యాట్రిక్ ఫ్రెంచ్, సామ్ మిల్లర్, ఎడ్వర్డ్ ల్యూస్, ఎలిజబెత్ బుమిలర్, మిరండా కెనడి” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి శ్రీనివాస్ సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు ఆయనకు పీహెచ్డీ పట్టాను ప్రదానం చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
పెద్దపల్లి జిల్లా రంగాపురం గ్రామానికి చెందిన ఆయన నగరంలో గత 25 ఏళ్లుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్లో శిక్షణ అందజేస్తున్నారు. ప్రతి ఏటా తన శిక్షణతో ఎంతోమందికి ఎంఏ ఇంగ్లీష్ కోర్సులో ప్రవేశంతో పాటు, నెట్, సెట్ అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దానితోపాటు ఆయన ప్రస్తుతం సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు, అధికారులు అభినందించారు.