e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home తెలంగాణ సమతా విగ్రహావిష్కరణకు రండి

సమతా విగ్రహావిష్కరణకు రండి

  • కేంద్ర మంత్రులకు చినజీయర్‌స్వామి ఆహ్వానం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (నమస్తే తెలంగాణ): శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆశ్రమంలో నిర్వహించనున్న శ్రీవైష్ణవ మతాచార్యులు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలకు హాజరుకావాలని పలువురు కేంద్ర మంత్రులను త్రిదండి చినజీయర్‌స్వామి ఆహ్వానించారు. గురువారం ఢిల్లీలో ఆయ న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌కు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మైహోమ్‌ గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శ్రీనివాస రామానుజం పాల్గొన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు నిర్వహించే సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా 216 అడుగుల ఎత్తయిన రామానుజుల పంచలోహ విగ్రహాన్ని (సమతా విగ్రహం) ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని అమిత్‌షా హామీ ఇచ్చారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement