భువనగిరి అర్బన్, మే 22: చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక శాఖ కళాకారులు నిర్వహించిన సమావేశంలో పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా గడ్డం స్వామి (యాదాద్రి భువనగిరి జిల్లా), కార్యనిర్వహక అధ్యక్షుడిగా గడ్డం హిమగిరి (జనగామ), ఉపాధ్యక్షులుగా గడ్డం సుదర్శన్ (వరంగల్), గడ్డం పెద్దులు (రంగారెడ్డి), జీ నరహరి (ములుగు), ప్రధాన కార్యదర్శులుగా పిల్లిట్ల రమేశ్ (సిద్దిపేట), పిల్లిట్ల చంద్రమౌళి (యాదాద్రి భువనగిరి), గౌరవాధ్యక్షులుగా గజవెల్లి గణపతి, గడ్డం వెంకటేశ్వర్లు, గడ్డం సమ్మయ్య, జబర్దస్త్ రాజమౌళిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.