హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాల్లో మిర్చి ధరలు మండుతున్నాయి. ఈ నెల 19 నుంచి వరంగల్, ఖమ్మం, మలక్‌పేట మార్కెట్లలో మిర్చి ధరలు పెరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధారణ రకాల ధరలు రూ.16,300 ఉండగా, శుక్రవారం ఈ రేట్లు మరింత పెరిగాయి. ఈ సీజన్లో ప్రతిరోజూ సుమారు 12 వేల బస్తాల వరకు మార్కెట్‌కు వస్తుండగా, శుక్రవారం 18వేల బస్తాలు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. ఎల్లో మిర్చి విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలు ఉండటంతో డిమాండ్ పెరిగింది. వరంగల్ ఎనుమాముల మారెట్యార్డులో వండర్హార్ట్ రకం క్వింటా రూ.26,200, తేజా రకం రూ.22,000, దీపికా రకం రూ.26, 200, యూఎస్-341రకం రూ.25, 500 పలుకగా, ఎల్లో మిర్చి క్వింటా రూ.44వేలు పలుకుతున్నది. అంతర్జాతీయ మారెట్లో ఎల్లో మిర్చికి ఎకువగా డిమాండ్ ఉండడం వల్లే ఇలా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ మిర్చిని చైనా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్‌కు ఎగుమతి చేస్తుంటారు. దీనిని ఎకువగా పెప్పర్ ఐటమ్‌గా ఉపయోగిస్తుంటారు. ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని మారెట్యార్డ్ అధికారులు చెబుతున్నారు.