హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్) కింద మిర్చి క్వింటాల్ ధర రూ.10,374గా నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర- కేంద్ర ప్రభుత్వాలు 50:50 నిధులను పంచుకుంటాయి. బహిరంగ మారెట్లో దళారీల వల్ల రైతులు మోసపోకుండా వారికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం మారెట్ ఇంటర్వెన్షన్ సీం తీసుకొచ్చింది. గడిచిన కొద్దికాలంగా తెలంగాణలో మిర్చి రైతులు దళారీల వల్ల మోసపోతున్నారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను బహిరంగ మారెట్లో సాగు ధర కంటే తకువ ధరకే అమ్మాల్సిన పరిస్థితి వస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ స్పందిస్తూ తెలంగాణ రైతులకు మేలు చేకూర్చేలా కింద మారెట్ ధరకు, సాగు ఖర్చుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చెల్లిస్తామని పేరొనడం అభినందనీయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.