సారంగాపూర్, నవంబర్ 2 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామానికి చెందిన ఏడాదిన్నర వయస్సు గల సయ్యద్ సహాద్పై శనివారం వీధి కుక్కలు దాడి చేశాయి. సహాద్ ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వీధి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో చిన్నారి ముఖం, తలకు గాయాలై తీవ్ర రక్తస్రావమైంది.
కుటుంబ సభ్యులు చికిత్స కోసం నిర్మల్ దవాఖానకు తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్కు తరలించారు.