Child Safety | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన చైల్డ్ సేఫ్టీ మార్గదర్శకాలు అటకెక్కాయి. బడుల్లో బాలలకు రక్షణ కరువైంది. అధికారులు, ప్రభుత్వం ఈ దిశగా దృష్టిసారించకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొన్నది. రెండేండ్ల క్రితం బంజారాహిల్స్‌లోని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ నాలుగేండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.
దీంతో గత ప్రభుత్వం పాఠశాలల్లోని పిల్లల భద్రతకు, భరోసానిచ్చేందుకు పటిష్టమైన మార్గదర్శకాలను రూపొందించేందుకు అప్పట్లో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ డ్రాఫ్ట్ మార్గదర్శకాలను రూపొందించి, ప్రభుత్వ పరిశీలనకు పంపించింది. కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిసారించకపోవడంతో విమర్శలొస్తున్నాయి.
మార్గదర్శకాల్లో కొన్ని..