గీసుగొండ, ఆగస్టు 23: విష జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘట న వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని విశ్వనాథపురంలో శుక్రవా రం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూల మహేందర్-శ్రీలత దంపతుల కుమార్తె నిత్యశ్రీ (9) వరంగల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నది. 20న నిత్యశ్రీకి జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక వైద్యుడిని సంప్రదించి సిరప్ వాడటంతో తగ్గింది. గురువారం చిన్నారికి వాంతులు, విరేచనాలు కావడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయినట్టు తల్లిదండ్రులు తెలిపారు.