మెదక్ : కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleshwaram project ) నిర్మాణం పై అసత్య ప్రచారం చేస్తూ, కుట్రపూర్వక చర్యలకు పునుకుందని బీఆర్ఎస్ (BRS ) మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ( Former MLA Padma Devender Reddy ) ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా శంకరంపేట్ ఆర్ మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం మెదక్, శంకరంపేట్ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రపూరితంగా సీబీఐ కి కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పుతుందని ఆరోపించారు . మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తెలంగాణను ఆంధ్ర నాయకులకు అప్పగించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కోసం మరో ఉద్యమం చేయడానికి సిద్ధమేనని అన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు అన్ని సాక్షాలతో సహా సమాధానాలు చెప్పినా గాని రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా సీబీఐకి అప్పచెప్పడం దురదృష్టకారమన్నారు.
బనకచెర్లకు నీళ్లు తీసుకుపోవడానికి కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర చేస్తూ ఆంధ్ర నాయకులకు పెత్తనం కోసం తోత్తులుగా మారారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట మండల అధ్యక్షులు పట్లోరి రాజు, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు సత్యనారాయణ గౌడ్, సుజాత శంకర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగా నరేందర్, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ సర్పంచ్ లు కుమార్ గౌడ్,పూలపల్లి యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, దయానంద యాదవ్, నాగరాజు, పోచయ్య, నాయకులు చిలక నాగరాజు, శ్రీనివాస్,సుధాకర్, రవీందర్, చంద్రం, మహిపాల్, రెడ్డి, బాగా రెడ్డి యాదగిరి, వెంకటేశం స్వామి ప్రసాద్ గౌడ్, వివిధ మండలాల నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు , కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.