CM Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించారు. డిసెంబర్ 9న సచివాలయంలో ఆవిష్కరించబోయే విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేటలో ప్రభుత్వం తయారు చేయిస్తున్నది. ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ఓ వెంచర్లో ఏర్పాటు చేసిన షెడ్డులో శిల్పం తయారీ పనులు జరుగుతున్నాయి.
స్థానిక నేతలు, మునిసిపల్ అధికారులు, ఇతరులకు సమాచారం ఇవ్వకుండా శుక్రవారం ముఖ్యమంత్రి ఒక్కరే నేరుగా అక్కడికి వెళ్లి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. రెండుమూడు రోజుల్లో పనులు పూర్తవుతాయని, అనంతరం సీఎం మరోమారు విగ్రహాన్ని పరిశీలిస్తారని తెలిసింది. డిసెంబర్ మొదటి వారంలో విగ్రహాన్ని సచివాలయానికి తరలించి ఆవిష్కరణకు సిద్ధం చేస్తారు. శిల్పం చెక్కుతున్న ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.