పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రైతు బంధు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అనంత రెడ్డి మాట్లాడుతూ ..దేశంలో ఎక్కడా లేని విధంగా ఏడాదికి రెండుసార్లు పంట పెట్టుబడి కింద రూ. 10వేలు అందిస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో 70.54 లక్షల మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ. 7,677 కోట్లను వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 65, 558 ను రైతుల ఖాతాల్లో చేరాయన్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ , రైతు బీమా ద్వారా మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున 94,500 మంది రైతు కుటుంబాలకు రూ. 4,725 కోట్లు ప్రభుత్వం అందించిందని అన్నారు.
చిరకాలం రాష్ట్ర రైతాంగమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లు బాలాజీ రావు, బండారి స్రవంతిశ్రీనివాస్, మోహన్ రావు, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ లు కావేటి రాజు, నిదనపురం దేవయ్య, సుధాకర్ రావు, ఈసరపు వెంకటేశం, అనంత రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, ఐరెడ్డి వెంకట్ రెడ్డి, రైతు కో ఆర్డినేటర్లు , రైతులు, రైతు సమన్వయ సమితి నాయకులు పాల్గొన్నారు.