Minister Jagadish Reddy | పెద్దగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసింది సీఎం కేసీఆరే : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | యాదవుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు పై కోలువై ఉన్న లింగమంతుల స్వామి ఆలయ రాజగోపురాల నిర్మాణం కోసం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టబోయే పనులకు గురువారం శంకుస్థాపన చేశారు.
నల్లగొండ : యాదవుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టు పై కోలువై ఉన్న లింగమంతుల స్వామి ఆలయ రాజగోపురాల నిర్మాణం కోసం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టబోయే పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాదవుల సంక్షేమం కోసం కేసీఆర్ చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం మాంసం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపిందన్నారు.
గత పాలకుల హయాంలో ఏనాడు పెద్దగట్టు ఆలయాన్ని పట్టించుకున్నది లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కోనేరు, గెస్టు హౌజ్, పూజారుల విశ్రాంతి భవనం, కార్యాలయం, విద్యుదీకరణ పనులు శాశ్వత ప్రతిపాదికన నిర్మించామని తెలిపారు. రెండేళ్లకి ఒకసారి జరిగే జాతర సమయంలో ఏర్పాట్ల కోసం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి జాతర వేడుకలను నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించామని పేర్కొన్నారు. త్వరలోనే సూర్యాపేటలో కనీవినీ ఎరుగని రీతిలో యాదవ సంక్షేమ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులు యాదవ్, వైస్ ఎంపీపీ జీవన్ రెడ్డి, సత్యనారాయణ, కౌన్సిలర్ లక్ష్మి, బాషా మియా, బత్తుల జానీ లక్ష్మీ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వి,రామగిరి నగేష్, జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, ఉప్పల ఆనంద్, మాజీ చైర్మన్ మద్ది శ్రీనివాస్ యాదవ్, కాచం శ్రీనివాస్, జటంగి వెంకటేశ్వర్లు, కాచం రాము, పచ్చిపాల అనిల్, సుంకరి శ్రీనివాస్, గుట్టేటి సైదులు యాదవ్, యాదగిరి, మెంతబోయిన నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

