Bhatti Vikramarka | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో పలుచోట్ల వెలిసిన భారీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. వీటిల్లో భట్టి విక్రమార్క, ఆయన భార్య నందిని నిలువెత్తు ఫొటోలు ముద్రించి, కింద పెద్ద అక్షరాలతో హ్యాపీ బర్త్ డే చీఫ్ మినిస్టర్ అని రాసి చిన్న అక్షరాలతో కనిపించీ, కనిపించనట్టుగా ‘డిప్యూటీ’ అని రాసి ఉండటమే ఈ కలకలానికి కార ణం. ఈ ఫ్లెక్సీలను గమనిస్తే, సీఎం రేవంత్‌రెడ్డా? భట్టి విక్రమార్కనా? అన్న సందేహం కలుగకమానదు. ‘భట్టి’నే చీఫ్ మినిస్టర్ అనే అభిప్రాయం కలిగేలా వాటిని ఏర్పాటుచేశా రు.
భట్టి అభిమానులు ఈ ఫ్లెక్సీల ఏర్పాటు లో వారి ఉద్దేశం ఏమిటన్నది కాంగ్రెస్ వర్గా ల్లో చర్చకు దారితీసింది. మారుమూల ప్రాం తంలో ఏర్పాటుచేసి ఉంటే ఆ విషయం భట్టి దృష్టికి వెళ్లపోవచ్చు, కానీ ప్రజాభవన్‌కు సమీపంలో బేగంపేటలో వెలిసిన ఫ్లెక్సీ లు ఆయన దృష్టికి వెళ్లకుండా, ఆయన చూ డకుండా ఎలా ఉంటారు? ఉద్దేశపూర్వకంగానే ఏర్పాటు చేసినట్టు ఉన్నదని కాంగ్రెస్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వ ప్రకటనల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోను తొలగించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గాలుగా చీలిపోతుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.